వేసవి కాలం ప్రతి నీటి బొట్టు విలువైనదే: టీ పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ రాములు.
ఎల్బీనగర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఈ ఆనందం మరియు ఈ. రాములు గారు*
ఎల్బీనగర్ ఏప్రిల్ 10 ,
గ్రేట్ తెలంగాణ ప్రతినిధి
వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ.ఆనందం సార్ అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ గారు, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరి ఎర్రవల్ల రాములు సార్ అన్నారు. మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందం సార్ మాట్లాడుతూ... వేసవికాలంలో బాటసారులు తాగేందుకు గుక్కెడు నీరు లభించక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బులు పెట్టుకొని మంచినీళ్ళ బాటిళ్లు కొని తాగే స్తోమత అందరికి ఉండదు కాబట్టి వచ్చిపోయే వాహనదారులు, పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఎల్ బీ నగర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేయడం సంతోషకరమని నిర్వాహకులను వారు అభినందించారు.
వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ ఎల్బీనగర్ ప్రధాన కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రజల దాహార్తిని తీర్చాలని ఆలోచన రావడం హర్శించదగ్గ విషయం అని ఈరోజుల్లో ఎవరి స్వార్థంతో వాళ్లు బతుకు తుంటే ఈ ఎండాకాలంలో పది మందికి మంచినీరు పోయాలని ఆలోచన రావడం అలాగే పది మందికి సేవ చేయాలని సహృదయంతో ఫౌండేషన్ సభ్యులు ముందుకు రావడం చాలా సంతోశించదగ్గ విషయం, వేసవి తాపం తాలలేక పక్షులు, మనుషులు ఎండకు విల విలలాడుతున్నాయి అలాగే దాహంతో ఉన్న బాటసారి తన దప్పిక తీర్చాలని పది మందికి సేవ చేయాలని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అని ఈ.రాములు గారు అన్నారు, ఈ ప్రధాన కూడలి నాలుగు రోడ్లు ఎల్బీనగర్ టు హయత్ నగర్ మరియు ఎల్బీనగర్ టు ఉప్పల్, ఎల్బీనగర్ టు
మహబూబ్నగర్ అలాగే ఎల్బీనగర్ టు కోటి బస్టాండ్ కు వెళ్లే ప్రధాన కూడలి కావడం సంతోషించ విషయం అందులో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ దాతృత్వాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు చాటుకున్నారు ఈ రోజుల్లో ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అంత మామూలు విషయం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది, నాలుగు నెలలు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రతినిధులకే దక్కుతుందనీ
ఫౌండేషన్ ప్రతినిధులను వచ్చిన పలువురు అతిథులు హర్షించారు. మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ..ఈ చలివేంద్రం మా ఒక్కరి కోసం కాకుండా పదిమందికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఎల్బీనగర్ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడం జరిగిందని దీని వెనకాల ప్రతి ఒక్కరి కృషి ఉందని ఈ ఫౌండేషన్ ప్రారంభం చేసిన అతిరథ మహారధులకు ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో
ఈ ఆనందం అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, ఈ రాములు టిపిసిసి
ఆర్గనైజింగ్ సెక్రటరీ,జగదీశ్వర్ రెడ్డీ PJR కోచింగ్ సెంటర్ డైరెక్టర్, మహమ్మదాబాద్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఈ పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ అప్పగల్ల నర్సిములు, మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు సి.దస్తయ్య, వైస్ ప్రసిడెంట్ మండల డానియల్, ప్రధాన కార్యదర్శి ఆనపోసల రామస్వామి, అణ్వేష నేత్రం ఎడిటర్ గోళ్ళ రమేష్, ధర్మగంట ఎడిటర్ శాంతయ్య. నేటి న్యాయం చీఫ్ ఎడిటర్ డి.వెంకట రమణ, కడారి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు, శేఖర్ జర్నలిస్టు,రాజేష్, చంద్రగిరి సత్యనారాయణ టీజేఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు.
pacs ఛైర్మెన్ గట్ల కేశవరెడ్డి, scrps స్టేట్ యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగం మహేశ్, వెంకటేష్,
కేశవులు తదితరులు పాల్గొన్నారు.